దలైలామాకు మాత్రమే ఆ అధికారం ఉంది

సిమ్లా: టిబెట్‌ మతపెద్దలు బుధవారం ధర్మశాలలో సమావేశమై దలైలామా వారసుడి ఎంపిక విషయమై చర్చించారు. లామాకే సర్వాధికారాలు ఉండి తన వారసుడిని ఎన్నుకునే ఆచారం అనాదిగా వస్తుందని.. అదే ప్రస్తుత లామా కొనసాగిస్తారని తీర్మానం చేశారు. 3 రోజులపాటు జరిగిన టిబెటన్ మత సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ బౌద్ధ లామాలు, టిబెట్ మతపెద్దలు, నాయకులు పాల్గొన్నారు. టిబెట్‌లో 800 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాన్ని ఆయన కొనసాగిస్తారని.. తదుపరి లామాను ఎన్నుకునే హక్కు కేవలం ప్రస్తుత లామాకు మాత్రమే ఉందని, నిర్ణయం పూర్తిగా దలైలామా వ్యక్తిగతమని పేర్కొన్నారు. అంతేకాక చైనా ఎన్నుకునే లామాను.. టిబెటన్లు ఎన్నడూ గౌరవించరని, లామాను నిర్ణయించే అధికారం ఇతర వ్యక్తులకు, ప్రభుత్వానికి లేదంటూ ఈ మేరకు నొక్కిచెప్పారు.